Ayyana Mane Series: ఈ మధ్య కాలంలో ఇలాంటి సిరీస్ రాలేదండోయ్!

Ayyana Mane Series Update
  • కన్నడలో రూపొందిన ఫ్యామిలీ సిరీస్ 
  • తెలుగులోను అందుబాటులోకి 
  • ఆకట్టుకునే కథాకథనాలు
  • పాత్రలను డిజైన్ చేసిన తీరు హైలైట్ 
  • జీ 5 నుంచి వచ్చిన బెస్ట్ సిరీస్ ఇది  

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చిన సిరీస్ లలో ప్రత్యేకంగా కనిపించింది .. డిఫరెంట్ గా ఉందనే టాక్ వినిపించింది 'అయ్యనా మానే' సిరీస్ విషయంలోనే. ఇటీవలే జీ 5లో 6 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కన్నడ నేపథ్యం కలిగిన ఈ సిరీస్, పోస్టర్స్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. కొత్త పెళ్లి కూతురుగా 'ఖుషీ రవి' కళకళలాడుతూ కనిపిస్తూ, ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. 

ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ గట్రా చూసిన వాళ్లు .. 'ఏవుందీ .. అత్తగారు .. కొత్తకోడలు' కథనే గదా అనుకున్నారు. నిజానికి ఇది అత్తగారి ఇంట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక కొత్త పెళ్లికూతురు కథనే. ఇక అత్త ఆరళ్లు .. కోడలి కొండంత సహనం .. ఇద్దరి మధ్య నలిగిపోయే భర్త .. ఈ తరహా రొటీన్ కథ నడుస్తుందని చాలామంది అనుకున్నారు. ఇక్కడే దర్శకుడు ఆడియన్స్ అంచనాలకు అందని కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథను అనూహ్యమైన మలుపులతో ముందుకు తీసుకుని వెళ్లాడు. 

ఒక వైపున కులదేవతకు ఆగ్రహం .. ఒక వైపున ప్రేతాత్మల వేధింపులు .. మరో వైపున అనుమానాస్పద మరణాలు .. కట్టుకున్న వాడిని నమ్మి కళ్లు మూసుకుని పడుకోలేని పరిస్థితిలో ఆ కోడలు పడిన ఆందోళన .. అడుగడుగునా ఆసక్తిని పెంచుతూ వెళతాయి. కథ .. అది జరిగే కాలంతో పాటు ప్రతి పాత్ర .. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి లభించిన ఇంట్రెస్టింగ్ సిరీస్ ఇది. జీ 5 నుంచి వచ్చిన మరో బెస్ట్ సిరీస్ ఇది.

Ayyana Mane Series
Kushi Ravi
Zee5 Telugu Series
Kannada Series
Telugu Web Series
Family Drama
OTT Series
Suspense Thriller
Horror Series
Indian Web Series

More Telugu News