Lucknow Super Giants: ఆరంభంలో లక్నో దూకుడు... చివర్లో కట్టడి చేసిన సన్ రైజర్స్

Lucknow Super Giants vs Sunrisers Hyderabad Lucknows Aggressive Start Controlled by SRH
  • లక్నోలో ఐపీఎల్ మ్యాచ్
  • సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసిన లక్నో 
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ స్వైరవిహారం చేయడంతో తొలి వికెట్ కు 115 పరుగులు లభించాయి. వీరిద్దరూ అర్ధ సెంచరీలతో రాణించారు. మార్ష్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 65... మార్క్రమ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. 

అయితే మిడిలార్డర్ లో నికోలాస్ పూర్ 26 బంతుల్లో 45 పరుగులు చేయడంతో లక్నో స్కోరు బోర్డు ముందుకు సాగింది. ఆరంభంలో ధారాళంగా పరుగులు సమర్పించిన సన్ రైజర్స్ బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో దూకుడుకు కళ్లెం వేశారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, హర్ష్ దూబే 1, హర్షల్ పటేల్ 1, నితీశ్ కుమార్ 1 వికెట్ తీశారు. 

ఇన్నింగ్స్ చివరి ఓవర్లో లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. అందులో ఓ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి తీయగా, మరో ఇద్దరు రనౌట్ అయ్యారు. ఆయుష్ బదోనీ (3), అబ్దుల్ సమద్ (3), శార్దూల్ ఠాకూర్ (4) విఫలమయ్యారు.
Lucknow Super Giants
Sunrisers Hyderabad
IPL 2024
Mitchell Marsh
Aiden Markram
Nicholas Pooran
Eshan Malinga
Harshal Patel
Nitish Kumar Reddy
Cricket

More Telugu News