Sunrisers Hyderabad: సన్ రైజర్స్ సూపర్ విక్టరీ... టోర్నీ నుంచి లక్నో అవుట్

Sunrisers Hyderabad Super Victory Lucknow Out of Tournament
  • 6 వికెట్ల తేడాతో గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్
  • 206 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించిన సన్ రైజర్స్ 
  • ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్
భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ పై ఎస్ఆర్ హెచ్ టీమ్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. 

సన్ రైజర్స్ జట్టులో ట్రావిస్ హెడ్ స్థానంలో వచ్చిన అధర్వ తైడే 13 పరుగులు చేసి అవుటైనప్పటికీ... మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), ఇషాన్ కిషన్ (35), హెన్రిచ్ క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32) రాణించడంతో విజయం నల్లేరుపై నడకే అయింది. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (5 నాటౌట్) గెలుపునకు అవసరమైన పరుగులు కొట్టి సన్ రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో దిగ్వేష్ రాఠీ 2, ఓ రూర్కీ 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలన్న లక్నో జట్టు ఆశలపై సన్ రైజర్స్ నీళ్లు చల్లారు. కోట్లు పెట్టి కొనుక్కున్న రిషబ్ పంత్ అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా లక్నో టీమ్ లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇక, ఈ మ్యాచ్ తో  తాజా ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ లో ఆడే జట్లపై స్పష్టత వచ్చింది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్తులు కైవసం చేసుకున్నాయి. మరో బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెలకొంది.
Sunrisers Hyderabad
SRH vs LSG
Lucknow Super Giants
IPL 2024
Abhishek Sharma
Heinrich Klaasen
Atharva Taide
Indian Premier League
Nitish Kumar Reddy
Krunal Pandya

More Telugu News