Bhuma Akhila Priya: ఆర్మీకి 5 నెలల జీతం విరాళంగా ప్రకటించిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

Bhuma Akhila Priya Donates 5 Months Salary to Army
  • ఆర్మీకి ఐదు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 
  • ఆళ్లగడ్డలో దేశ సైనికులకు సంఘీభావంగా తిరంగా రన్ నిర్వహణ
  • ఆళ్లగడ్డలో పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన 
తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన ఐదు నెలల వేతనాన్ని ఆర్మీకి విరాళంగా ప్రకటించి దేశభక్తిని చాటుకున్నారు. దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ యుద్ధంలో అమరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్‌కు అఖిలప్రియ నివాళులర్పించారు.

పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని అన్నారు. తన ఐదు నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే మంచి మనసును అందరూ ప్రశంసించారు. 
Bhuma Akhila Priya
TDP MLA
Andhra Pradesh Politics
Army Donation
Indian Army
Tiranga Rally
Allagadda
Patriotism
Telugu Jawan
Murali Naik

More Telugu News