Robert Kiyosaki: ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై హెచ్చరిక చేసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత

Robert Kiyosaki Warns of Impending Global Economic Crisis
  • పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదన్న రాబర్ట్ కియోసాకి
  • బంగారం, వెండి, బిడ్ కాయిన్ లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చన్న కియోసాకి
  • సోషల్ మీడియాలో కియోసాకి ట్వీట్ వైరల్
రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా హెచ్చరించారు. ఎక్స్ వేదికగా ఆయన ఆర్థిక చరిత్రలో కీలకమైన క్షణాలను ఎత్తి చూపారు. ఈ పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదని ఆయన పేర్కొన్నారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు 1.6 ట్రిలియన్ డాలర్ల విద్యార్థి రుణ మార్కెట్ పతనం వల్ల తదుపరి సంక్షోభం ఏర్పడుతుందనే రికార్డ్స్ అభిప్రాయాన్ని ఆయన గుర్తు చేశారు.

సాంప్రదాయ పొదుపు ఇకపై సురక్షితం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. తాను 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో చెప్పినట్లుగా ధనికులు డబ్బు కోసం పని చేయరని, పొదుపు చేసేవారు నష్టపోతారని పేర్కొన్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడవచ్చని ఆయన అన్నారు. 2012లో రిచ్ డాడ్ ప్రవచనంలో తాను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైందని, దయచేసి జాగ్రత్తగా ఉండాలని కియోసాకి సూచించారు. ప్రస్తుతం కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Robert Kiyosaki
Rich Dad Poor Dad
Global Economic Crisis
Financial Crisis
US Dollar
Gold Standard
Bitcoin
Student Loan Market
Economic Recession
Investment

More Telugu News