Mumbai Crime: రెండేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. తల్లి సమక్షంలోనే ప్రియుడి పైశాచికత్వం!

Mumbai Crime 2 year old girl sexually assaulted and murdered
  • చిన్నారిపై అత్యాచారం.. హత్య చేసిన తల్లి ప్రియుడు
  • నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు
  • పోక్సో, భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు
ముంబై నగరంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి ప్రియుడి చేతిలో రెండేళ్లన్నర పసిపాప అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురైంది. మల్వాణీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మల్వాణీకి చెందిన 30 ఏళ్ల మహిళకు 19 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. మహిళ రెండున్నరేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఆపై గొంతు నులిమి చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు. చిన్నారి మూర్ఛతో పడిపోయిందంటూ నిందితులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందడంతో వైద్యులు అనుమానించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఆ వెంటనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చిన్నారి మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు ఆమెపై లైంగిక దాడి జరిగిందని, ఊపిరాడకపోవడం వల్ల కలిగిన షాక్‌తో పాప మరణించిందని ధ్రువీకరించారు. ఈ ఘటనలో తల్లి, ఆమె ప్రియుడి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారిపై లైంగిక నేరాల నుంచి పిల్లల పరిరక్షణ చట్టం (పోక్సో), భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Mumbai Crime
Mumbai
Child Abuse
POCSO Act
Crime News
Sexual Assault
India Crime
Malwani
Child Death

More Telugu News