Telugu Desam Party: 24,25 తేదీల్లో జర్మనీలో మినీ మహానాడు .. పోస్టర్ ఆవిష్కరించిన నేతలు

Telugu Desam Party Mini Mahanadu in Germany on 24th 25th
  • కడప జిల్లాలో ఈ నెల 27 నుంచి 29వరకూ టీడీపీ మహానాడు
  • జర్మనీలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఆధ్వర్యంలో 24, 25 తేదీల్లో మినీ మహానాడు 
  • మినీ మహానాడు పోస్టర్లను ఆవిష్కరించిన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈ నెల 27వ తేదీ నుండి మూడు రోజుల పాటు కడప జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మహానాడు కార్యక్రమాలను పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇతర దేశాల్లోనూ అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాల ఆధ్వర్యంలో మినీ మహానాడు, ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌లోనూ ఈ నెల 24, 25 తేదీల్లో మినీ మహానాడు, ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమాల నిర్వహణకు అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ విభాగం అధ్యక్షుడు పవన్ కుర్రా నిన్న ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో కలిసి మినీ మహానాడు పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గౌతు శిరీష, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరవుతారని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి, మినీ మహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి, శివ తదితరులు పాల్గొన్నారు. 
Telugu Desam Party
Germany Mini Mahanadu
NTR Jayanthi
NRI TDP
Kollu Ravindra
Gouthu Sirisha
Mannava Subbarao
Frankfurt

More Telugu News