Nara Lokesh: నిజాన్ని నిర్భయంగా చెప్పడం ప్రకాశం పంతులు నైజం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Pays Tribute to Tanguturi Prakasam Pantulu
  • టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతికి మంత్రి లోకేశ్ నివాళి
  • ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ప్రగతికి బాటలు వేశారన్న లోకేశ్
  • ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేశారని కితాబు
  • స్వాతంత్య్ర ఉద్యమం, స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని వెల్లడి
  • ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఉద్ఘాటన
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు 'ఆంధ్రకేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం పంతులు సేవలను, ఆశయాలను ఈ సందర్భంగా లోకేశ్ స్మరించుకున్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి విశేషమైన బాటలు వేశారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రకాశం పంతులు నిరంతరం శ్రమించారని కొనియాడారు.

సమాజంలో జరిగే అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించడం, వాస్తవాలను నిర్భయంగా వెల్లడించడం టంగుటూరి ప్రకాశం పంతులు గారి సహజ లక్షణాలని లోకేశ్ కీర్తించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలోనూ, ఆంధ్ర రాష్ట్ర సాధనలోనూ ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు.

ప్రకాశం పంతులు గారి జీవితం, ఆయన ఆచరించిన విలువలు నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఆయన నిర్దేశించిన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
Nara Lokesh
Tanguturi Prakasam Pantulu
Andhra Kesari
Andhra Pradesh
Freedom fighter
Chief Minister
Nara Lokesh comments
Political news
Andhra Pradesh politics

More Telugu News