Dalli Govind Reddy: గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ పదవి కూటమి వశం

Janasenas Dalli Govind Reddy New Visakhapatnam Deputy Mayor
  • డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి
  • ఏకగ్రీవంగా ఎన్నికైన గోవింద్ రెడ్డి
  • ఇప్పటికే మేయర్ పదవిని చేపట్టిన టీడీపీ
ఏపీలో మరో పదవి వైసీపీ చేజారింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖలోని 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా... మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. వైసీపీ ఈ ఎన్నికకు దూరంగా ఉండటంతో గోవిందరెడ్డి నామినేషన్ మాత్రమే దాఖలయింది. దీంతో, గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. 

మేయర్ పదవిని ఇప్పటికే టీడీపీ చేపట్టింది. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక తప్పనిసరి అయింది. ఈ క్రమంలో జీవీఎంసీలో కూడా వైసీపీ అధికారాన్ని కోల్పోయినట్టయింది.
Dalli Govind Reddy
GVMC
Visakhapatnam
Deputy Mayor
Janasena
TDP
YCP
Andhra Pradesh Politics
Vishnu Kumar Raju
Gana Babu

More Telugu News