Nara Lokesh: బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేశ్... థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్

- నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
- తారక్ పై విషెస్ వెల్లువ
- సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ (మే 20) పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'తారక్' పుట్టినరోజు సందడి కనిపిస్తోంది. తాజాగా, ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే తారక్. ఈ ఏడాది సంపూర్ణ సంతోషం పొందాలని, విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. లోకేశ్ ట్వీట్ కు ఎన్టీఆర్ స్పందించారు. నీ హార్దిక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు లోకేశ్ అంటూ బదులిచ్చారు.