Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu Orders on AP Districts Reorganization
  • జిల్లాల పునర్విభజన అంశంపై మంత్రులతో సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు
  • జిల్లాల పునర్విభజన హామీలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • కూటమి నేతలు, వివిధ సంఘాలను భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచన
జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మంత్రులతో జిల్లాల పునర్విభజనపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, కూటమి ఇచ్చిన హామీలపై త్వరితగతిన నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలతో పాటు వివిధ సంఘాల వారిని భాగస్వాములను చేసి నివేదిక రూపొందించాలని ఆయన తెలిపారు.

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా, పోలవరం ముంపు మండలాలు, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు వంటి హామీలను అమలు చేసే అంశంపై చర్యలు వేగవంతం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Districts Reorganization
Districts Formation
Markapuram District
Polavaram
TDP
Janasena
BJP

More Telugu News