Sunrisers Hyderabad: సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ వేదిక మారింది!

Sunrisers Hyderabad RCB Match Venue Changed to Lucknow
  • కీలక నిర్ణయాన్ని ప్రకటించిన బీసీసీఐ 
  • మే 23న చిన్న స్వామి స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ను లక్నోకు మార్పు చేసిన బీసీసీఐ 
  • వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మ్యాచ్ వేదిక మార్పు చేసిన బీసీసీఐ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. మే 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను బీసీసీఐ లక్నోకు మార్చింది.

భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో బెంగళూరులోని క్రికెట్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. సొంత గడ్డపై తమ జట్టు ఆటను చూడలేకపోతున్నామని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 23వ తేదీ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. మ్యాచ్ వేదిక మార్పుతో బెంగళూరులోని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఐపీఎల్ పునరుద్ధరణ తర్వాత మే 17న జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. టాస్ కూడా వేయకముందే భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ దిగులుగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
Sunrisers Hyderabad
RCB
Royal Challengers Bangalore
IPL 2024
Match Venue Change
Lucknow
Chinnaswamy Stadium
Rain Forecast
BCCI

More Telugu News