Nidhi Bhavan: అమరావతిలోని నిధి భవన్ లో అగ్ని ప్రమాదం

Nidhi Bhavan Fire Accident at Andhra Pradesh Finance Office in Amaravati
  • ఏపీ ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నిధి భవన్
  • భయంతో కిందికి పరుగులు తీసిన ఉద్యోగులు
  • షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం అమరావతిలోని నిధి భవన్ లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో సుమారు 300 మంది ఉద్యోగులు భయంతో కిందికి పరుగులు తీశారు. సెంట్రల్‌ ఏసీలో షార్ట్‌ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.

మంటలు ఎగిసిపడడంతో కంప్యూటర్లు కాలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతభత్యాలు, వివిధ శాఖలకు సంబంధించిన లావాదేవీల బిల్లులు నిధి భవన్ లోనే ఉంటాయి. ఆన్ లైన్ వ్యవస్థే అయినప్పటికీ కంప్యూటర్లు మొత్తం కాలిపోవడంతో సమాచారం కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, అగ్ని ప్రమాదంతో ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు.
Nidhi Bhavan
Amaravati fire accident
Andhra Pradesh finance department
Nidhi Bhavan fire
AP government office fire
Short circuit fire
Government office fire
Amaravati news
AP news

More Telugu News