Mohanlal: మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్

Mohanlal Kannappa Special Glimpse Released on Birthday
––
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్, పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ కు సంబంధించి మేకర్ మరో అప్ డేట్ విడుదల చేశారు. కన్నప్పలో మోహన్ లాల్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా కన్నప్ప నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుంచి అందరినీ ఆకట్టుకునే అప్డేట్‌ను వదిలారు. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ చిత్రంతో మోహన్ లాల్ మళ్లీ ఆడియెన్స్‌పై తనదైన ముద్ర వేసేలా కనిపిస్తున్నారు. మోహన్‌లాల్ ఫ్యాన్స్‌ను మెప్పించేలా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

‘కన్నప్ప’ లో దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్‌లాల్ పోషించారు. ఈ పాత్రలో మోహన్‌లాల్ ప్రెజెన్స్, యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం విష్ణు మంచు, కన్నప్ప టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూఎస్ టూర్‌ను పూర్తి చేశారు. కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Mohanlal
Kannappa
Manchu Vishnu
Indian Movie
Pan India Movie
Telugu Cinema
Mohanlal Birthday
Kiratha Character
US Tour
Movie Promotions

More Telugu News