Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ కు పదోన్నతిపై బీజేపీ ఎద్దేవా

BJP mocks promotion of Pak Army Chief Asim Munir
  • ఓడిపోయి, చావుదెబ్బతిన్నందుకు అవార్డు ఇచ్చినట్లున్నారు.. 
  • బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ వ్యంగ్యం
  • అసీమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించిన పాకిస్థాన్
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారతదేశంపై దాడికి ప్రయత్నించి దారుణంగా దెబ్బతిన్న పాకిస్థాన్.. తన ఓటమిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటోందని బీజేపీ ఎద్దేవా చేసింది. భారత సైన్యం ఎదురుదాడిలో సైనికులను, సైనిక స్థావరాలను కోల్పోయి.. అన్నివిధాలుగా పాక్ నష్టపోయింది. అయినప్పటికీ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు ప్రభుత్వం ‘ఫీల్డ్ మార్షల్’ పదోన్నతి కల్పించింది. దీనిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

‘మన సైన్యాన్ని నిలువరించడంలో విఫలమైన అసీమ్ మునీర్ కు పాక్ పదోన్నతి కల్పించింది. ఇది వైఫల్యానికీ అవార్డు ఇచ్చినట్లుంది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్థాన్‌ చావుదెబ్బతింది. 9 ఉగ్రస్థావరాలను భారత సైన్యం నేలకూల్చింది. 13 వైమానిక స్థావరాలు, జాతీయ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థతో పాటు వందలాది డ్రోన్‌లను ధ్వంసం చేసింది. పాక్ సైన్యం 70 మందికి పైగా సైనికులను కోల్పోయింది. అయినా, ఆసీమ్‌ మునీర్‌కు ఫీల్డ్‌ మార్షల్‌గా పాకిస్థాన్ పదోన్నతి కల్పించింది’ అని మాలవీయ ట్వీట్ చేశారు.
Asim Munir
Pakistan Army
Amit Malviya
BJP
Operation Sindoor
India Pakistan relations
Field Marshal
Military operation
Terrorist camps
Indian Army

More Telugu News