Chandrababu Naidu: అమ్మవారికి సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు

- కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు
- ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
- అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్న బాబు, భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. తన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆయన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వీరు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. దీంతో, అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు.
మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. దీంతో, అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు.