Stock Market: స్టాక్ మార్కెట్ల మూడు రోజుల నష్టాలకు బ్రేక్

Sensex Gains 410 Points Ending Three Day Loss
  • 410 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 129 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్ షేరు విలువ
వరుసగా మూడు సెషన్ల నుంచి నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఫార్మా సూచీల అండతో మార్కెట్లు లాభపడ్డాయి. ఒకానొక సమయంలో 800 పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్... చివరకు 410 పాయింట్ల లాభంతో 81,596 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,813 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.64గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.02%), టాటా స్టీల్ (1.86%), సన్ ఫార్మా (1.57%), టెక్ మహీంద్రా (1.39%), బజాజ్ ఫైనాన్స్ (1.36%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.39%), కొటక్ మహీంద్రా (-0.77%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.62%), ఐటీసీ (-0.44%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%).


Stock Market
Sensex
Nifty
Indian Stock Market
Share Market
BSE Sensex
Bajaj Finserv
Tata Steel
Sun Pharma

More Telugu News