Kolkata Police: కోల్‌కతాలో రాత్రిపూట డ్రోన్ వంటి వస్తువుల కలకలం

Kolkata Police Investigate Drone like Objects Spotted at Night
  • పలు ప్రాంతాల్లో డ్రోన్ వంటి అనుమానాస్పద వస్తువులు
  • మహేస్థల వైపు నుంచి వచ్చినట్లు గుర్తింపు
  • గూఢచర్యం కోణంలో పోలీసుల దర్యాప్తు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్ల వంటి వస్తువులు సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ పరిణామంతో నగర పోలీసులు అప్రమత్తమై భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. గూఢచర్యం సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు పరిసరాల్లో రాత్రి వేళ దాదాపు పది డ్రోన్ల వంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయని పోలీసులు తెలిపారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఇవి వచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో కోల్‌కతా నగర పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు.

హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ వస్తువుల కదలికలను తొలుత గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇవి డ్రోన్లను పోలి ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై నగర పోలీసులతో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కోల్‌కతా డిటెక్టివ్ విభాగం రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటిని ఎవరు నడుపుతున్నారు? వీటి వెనుక గూఢచర్యపు కోణం ఏమైనా ఉందా? అనే దిశగా అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Kolkata Police
Kolkata
West Bengal
Drones
Hastings
Vidyasagar Setu
Security Alert
India Pakistan Tension
Intelligence
Investigation

More Telugu News