Vijay Wadettiwar: రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..?

Vijay Wadettiwar Questions Use of Missiles on Pakistan Drones
  • ఆపరేషన్ సిందూర్ పై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
  • సైనిక ఘర్షణలో మన సైన్యానికి వాటిల్లిన నష్టం ఎంతో చెప్పాలని నిలదీత
  • ప్రభుత్వాన్ని వివరణ కోరడం తప్పెలా అవుతుందన్న మహారాష్ట్ర నేత
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తో సైనిక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. పాక్ మన నగరాలపై ప్రయోగించిన వందలాది డ్రోన్లను సైన్యం కూల్చివేసింది. అయితే, ఈ ఘర్షణపై మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వాడిట్టివార్‌ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ సైన్యం చైనా డ్రోన్లను ప్రయోగించగా మన సైన్యం క్షిపణులతో కూల్చివేసిందని అధికార వర్గాలు తెలిపాయని ఆయన గుర్తు చేశారు. చైనా డ్రోన్ల ఖరీదు ఒక్కొక్కటీ రూ.15 వేలకు మించదని, ఇలాంటి డ్రోన్లను కూల్చివేయడానికి రూ.15 లక్షలు విలువ చేసే క్షిపణులను ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

నాగ్‌పుర్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తర్వాత చోటుచేసుకున్న సైనిక ఘర్షణలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చినట్లు వివరించింది. అయితే, మనవైపు నుంచి జరిగిన నష్టంపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పాక్ ప్రభుత్వం మన యుద్ధ విమానాలను కూల్చివేశామని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సైనిక ఘర్షణ సందర్భంగా మనవైపు చోటుచేసుకున్న నష్టం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పెలా అవుతుంది?’’ అంటూ విజయ్ వాడిట్టివార్ ప్రశ్నించారు.
Vijay Wadettiwar
Pakistan drones
Indian Army
China drones
Operation Sindoor
Military conflict
Missiles
Nagpur
Maharashtra Congress

More Telugu News