Randhir Jaiswal: ఆ విషయం చైనాకు బాగా తెలుసు: పాకిస్థాన్‌కు మద్దతుపై భారత్ కీలక వ్యాఖ్యలు

Randhir Jaiswal on India China relations and Pakistan support
  • 2025 మే 10న జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడి
  • పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ దృఢ వైఖరిని వెల్లడించారని స్పష్టీకరణ
  • పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం... ఇవే ద్వైపాక్షిక సంబంధాలకు ఆధారమని వ్యాఖ్య
భారత్, చైనా దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అత్యంత అవసరమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న సరిహద్దు ఉగ్రవాదం విషయంలో తమకున్న దృఢమైన అభిప్రాయాన్ని చైనాకు ఇదివరకే తెలియజేశామని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దిల్లీలో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి, సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధి అయిన వాంగ్ యీ మధ్య 2025 మే 10న సంభాషణ జరిగినట్లు రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ చర్చల సందర్భంగా, పాకిస్థాన్ ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాదంపై భారత దేశపు నిశ్చయాత్మకమైన, దృఢమైన వైఖరిని జైశంకర్ చైనా ప్రతినిధికి తెలియజేశారని అన్నారు.

"భారత్-చైనా సంబంధాలకు పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ప్రాతిపదికగా ఉంటాయన్న విషయం చైనాకు తెలుసు" అని జైస్వాల్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి, తదనంతర పరిణామాల సమయంలో టర్కీతో పాటు చైనా కూడా పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత్ తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు తెలిపింది.
Randhir Jaiswal
India China relations
India China border issue
Pakistan terrorism
MEA India

More Telugu News