Kavitha: కవిత మరో వైఎస్ షర్మిల: బండి సంజయ్

Kavitha Like Another YS Sharmila Says Bandi Sanjay
  • కవిత లేఖతో తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం
  • ఓటీటీ ఫ్యామిలీ డ్రామా అంటూ బండి సంజయ్ వ్యంగ్యం
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని విమర్శలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, 'కాంగ్రెస్ వదిలిన బాణం' అనే శీర్షికతో కవిత లేఖ ఒక ఓటీటీ ఫ్యామిలీ డ్రామాలా ఉందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణను విఫలం చేశాయని, ఇప్పుడు రెండూ కలిసి బీజేపీని నిందిస్తున్నాయని మండిపడ్డారు. కుటుంబ పార్టీలు తమ వ్యక్తిగత సంక్షోభాలను ప్రజా భావోద్వేగాలుగా మార్చే ప్రయత్నం చేస్తాయని, చట్టం ముందు ఎవరైనా దోషులేనని స్పష్టం చేశారు.

మరోవైపు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, కవిత లేఖ రాజకీయ పంచాయతీనా లేక ఆస్తుల పంచాయతీనా అని సందేహం వ్యక్తం చేశారు. కవిత మరో వైఎస్ షర్మిలలా తయారయ్యారని, ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. ఈ పరిణామాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
Kavitha
Kalvakuntla Kavitha
BRS
Bandi Sanjay
YS Sharmila
Telangana Politics
KCR
Revanth Reddy
BJP Telangana
Family Politics

More Telugu News