Ram Gopal Varma: సెన్సార్ బోర్డుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma Slams Censor Board
  • స్మార్ట్‌ఫోన్లలో పోర్న్, హింస చూస్తున్నారన్న వర్మ
  • సినిమాల్లో వద్దనడం అర్థరహితమంటూ వ్యాఖ్య
  • సెన్సార్ బోర్డు ఎప్పుడో ఎక్స్‌పైర్ అయిందన్న ఆర్జీవీ
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అసభ్య పదజాలం, సెన్సార్ బోర్డు తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్జీవీ, పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.

"సినిమాల్లో బూతులు ఉండకూడదని చాలా మంది వాదిస్తుంటారు. సెన్సార్ బోర్డు కూడా అనేక నిబంధనలు విధిస్తోంది. సినిమాల్లోనే ఇదంతా ఉన్నట్లు మాట్లాడుతున్నారు" అని ఆర్జీవీ అన్నారు. "ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వాటిలో పోర్న్ వీడియోలు, అత్యంత హింసాత్మక దృశ్యాలు సులువుగా చూస్తున్నారు. అలాంటప్పుడు, వినోదం కోసం తీసే సినిమాల్లో ఇది ఉండొద్దు, అది చూపించొద్దు అనడం ఎలా సమంజసం? ఫోన్లో చూస్తే తప్పు లేనప్పుడు, పెద్ద తెరపై బూతులు చూస్తే తప్పేంటి? ఇలాంటి ఆంక్షలు పెట్టడం నిజంగా అర్థం లేని పని" అని ఆయన అభిప్రాయపడ్డారు.

సెన్సార్ బోర్డు పనితీరుపై మండిపడుతూ, "సెన్సార్ బోర్డ్ అనేది ఎప్పుడో కాలం చెల్లిపోయింది (ఎక్స్‌పైర్ అయిపోయింది). అదొక స్టుపిడ్ థింగ్" అంటూ ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముక్కుసూటిగా మాట్లాడటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆర్జీవీకి కొత్తేమీ కాదు. అయితే, ఈసారి ఏకంగా సెన్సార్ బోర్డునే ఆయన తప్పుబట్టడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాలి. 
Ram Gopal Varma
RGV
Ram Gopal Varma comments
Censor Board
Telugu cinema
Tollywood
RGV controversy
Pornography
Indian cinema
Movie censorship

More Telugu News