Chandrababu Naidu: తాటిచెర్లమోటు రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్

Chandrababu Naidu shocked by Taticherlamotu road accident
  • ప్రకాశం జిల్లాలో లారీ, కారు ఢీ
  • ఆరుగురి దుర్మరణం
  • చాలా బాధాకరమన్న చంద్రబాబు
  • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న పవన్
  • ప్రమాద వివరాలు తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్
ప్రకాశం జిల్లా తాటిచెర్లమోటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన చెందారు. మహానంది దర్శనానికి వెళ్లి వస్తూ ఇలా ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి అవసరమైన సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తాటిచెర్లమోటు రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం ప్రకాశం జిల్లా తాటిచెర్లమోటు దగ్గర చోటుచేసున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. స్టూవర్టుపురంనకు చెందిన మహానంది వెళ్ళొస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహానంది దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న వారు దుర్మరణం చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న మంత్రి, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


Chandrababu Naidu
Prakasam district
Road accident
Taticherlamotu
Pawan Kalyan
Nara Lokesh
Mahanandi
Andhra Pradesh
Accident victims
Gotipati Ravikumar

More Telugu News