Hamburg Train Station: జర్మనీలో రైల్వే ప్లాట్ ఫామ్ పై నిల్చున్నవారిపై దుండగుడి దాడి

Hamburg Train Station Attack Several Injured in Germany
  • జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన 
  • వ్యక్తులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఓ దుండగుడు
  • నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన పోలీసులు 
జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడటంతో కలకలం రేగింది. ప్లాట్‌ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తులపై జరిగిన ఈ దాడిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలుత ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని హామ్‌బర్గ్ పోలీసులు 'ఎక్స్' వేదికగా తెలిపారు. ఈ దాడిలో ఒక్కడే పాల్గొన్నాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
Hamburg Train Station
Germany stabbing
Hamburg attack
Germany train attack
Knife attack Germany
Hamburg central station
Europe news
Train station violence
Germany crime

More Telugu News