Nimmala Ramanayudu: ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల

AP Irrigation Minister Nimmala Orders Speedy Completion of Projects
  • ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలన్న మంత్రి నిమ్మల రామానాయుడు 
  • పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్
ప్రాజెక్టు పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేందుకు అదనపు మిషనరీ, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో పోలవరం ఎడమ కాలువ, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తిచేసేలా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఇటీవల కురుస్తున్న అకాల వర్షం వేగంగా జరుగుతున్న పనులకు ఆటంకం కలిగిస్తోందని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. వెలిగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. 
Nimmala Ramanayudu
AP Irrigation
Polavaram Left Canal
Handri Neeva Project
Veligonda Project
Andhra Pradesh Irrigation Projects
Irrigation Department AP
AP Water Resources
Project Progress Review

More Telugu News