Kalvakuntla Kavitha: 'సీఎం సీఎం' అంటూ కవిత అనుచరుల నినాదాలు... కనిపించని కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు

Kavitha Returns From US Trip Supporters Chant CM CM Slogans
  • అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత
  • ఎయిర్ పోర్ట్ వద్ద కవిత కటౌట్లు, బ్యానర్లు
  • కనిపించని బీఆర్ఎస్ జెండాలు
అమెరికా పర్యటన ముగించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వెలుపల "టీమ్ కవితక్క" పేరుతో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్వాగత ఏర్పాట్లలో ఎక్కడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రాలు గానీ, బీఆర్ఎస్ పార్టీ జెండాలు గానీ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అక్కడికి చేరుకున్న అభిమానులు 'సీఎం సీఎం', 'కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి', 'జై కవితక్క' అని పెద్దగా నినాదాలు చేశారు. తన కుమారుడి కాన్వొకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ నెల 16న కవిత తన భర్త అనిల్‌తో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. కాగా, కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Kalvakuntla Kavitha
BRS
KCR
KTR
Telangana Politics
BRS Party
Telangana
Kavitha America Tour
Kavitha News
Kavitha Supporters

More Telugu News