Tamannaah Bhatia: మైసూర్ శాండ‌ల్ అంబాసిడ‌ర్‌గా త‌మ‌న్నా.. క‌ర్ణాట‌క ఎంపీ వార్నింగ్‌!

Krishna Datta Odeyar Warns Against Tamannaah as Mysore Sandal Ambassador
  • ఇటీవ‌ల త‌మ‌న్నాను మైసూర్ శాండ‌ల్‌, శ్రీగంధ‌ముకు బ్రాండ్‌ అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం 
  • దీనిపై అక్క‌డ తీవ్ర వ్య‌తిరేక‌త 
  • తాజాగా ఎంపీ కృష్ణ‌ద‌త్త ఒడేయ‌ర్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో ధ్వ‌జం
  • త‌మ‌న్నాకు క‌న్న‌డ రాద‌ని, ఆమె బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అస‌లు వ‌ద్ద‌న్న ఎంపీ
  • ఆమెను అంబాసిడ‌ర్‌గా కొన‌సాగిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రిక‌
ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టి త‌మ‌న్నా భాటియాను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మైసూర్ శాండ‌ల్‌, శ్రీగంధ‌ముకు బ్రాండ్‌ అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిపై అక్క‌డ తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. త‌మ‌న్నాకు క‌ర్ణాట‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని, లోక‌ల్ క‌థానాయిక‌ను బ్రాండ్‌సింబ‌డ‌ర్‌గా చేయాల‌నే డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బీజేపీ పార్టీ నేత‌లు ఈ విషయాన్ని తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు. 

ఈ క్ర‌మంలో తాజాగా ఎంపీ కృష్ణ‌ద‌త్త ఒడేయ‌ర్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మిల్కీబ్యూటీకి క‌న్న‌డ రాదంటూ, ఆమె బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అస‌లు వ‌ద్ద‌ని అన్నారు. త‌మ‌న్నాను అంబాసిడ‌ర్‌గా కొన‌సాగిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ఎంపీ హెచ్చ‌రించారు. త‌మ పూర్వీకుడు కృష్ణ‌రాజు ఒడేయ‌ర్ 1916లో పెట్టిన మైసూర్ కంపెనీకి ప‌ర‌భాష న‌టుల‌ను అంబాసిడ‌ర్‌గా పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 

అటు క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు కూడా క‌న్న‌డ భాష రాని వారికి, అస‌లు క‌న్న‌డ సంస్కృతి, సంప్ర‌దాయం తెలియ‌ని వారికి రూ. 6.2కోట్లు ఇచ్చి మ‌రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్ట‌డం ఏంటంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారం క‌ర్ణాట‌క‌లో హ‌ట్‌టాపిక్ గా మారింది.     
Tamannaah Bhatia
Mysore Sandal
Karnataka
Krishna Datta Odeyar
Brand Ambassador Controversy
Kannada Culture
Sandalwood
Karnataka Politics

More Telugu News