PSR Anjaneyulu: పీఎస్సార్ ఆంజనేయులుకు అస్వస్థత...ఆసుపత్రికి తరలింపు

PSR Anjaneyulu Falls Ill Shifted to Hospital
  • విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు
  • పీఎస్సార్ బీపీ లెవెల్స్ డౌన్
  • చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు
ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు, ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జత్వానీ కేసులో ఆయన రిమాండ్ ను విజయవాడ కోర్టు వచ్చే నెల 4వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు జైల్లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. బీపీ స్థాయులు పడిపోవడంతో ఆయనను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 

మరోవైపు హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలంలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో నిన్న ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఈ ఫామ్ హౌస్ లోనే గత నెల 22న ఆయనను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
PSR Anjaneyulu
Kadambari Jatwani
APPSC Scam
Vijayawada Jail
IPS Officer
CID Raid
Moinabad Farmhouse
Andhra Pradesh

More Telugu News