DK Aruna: ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోము.. క‌విత‌పై బీజేపీ ఎంపీ డీకే అరుణ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

DK Aruna Sensational Comments on Kavitha Joining BJP
  • క‌విత‌ను ఎట్టిప‌రిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమ‌న్న డీకే అరుణ
  • అన్ వాంటెడ్ గెస్టుల‌ను పార్టీలోకి  ఆహ్వానించ‌బోమ‌ని వెల్ల‌డి
  • తండ్రి కేసీఆర్‌కు క‌విత రాసిన లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఆమెనే చెప్పాల‌న్న ఎంపీ
ఎమ్మెల్సీ క‌విత‌పై బీజేపీ ఎంపీ డీకే అరుణ తాజాగా సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. శ‌నివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో విలేక‌ర్ల‌తో మాట్లాడిన ఆమె... క‌విత‌ను ఎట్టిప‌రిస్థితుల్లో బీజేపీలో చేర్చుకోమ‌ని అన్నారు. ఎవరిని బడితే వారిని పార్టీలో చేర్చుకోమని, పార్టీలో చేరుతామ‌నే వాళ్లెవ‌రో చూసి చేర్చుకుంటామ‌న్నారు. అన్ వాంటెడ్ గెస్టుల‌ను పార్టీలోకి  ఆహ్వానించ‌బోమ‌ని తెలిపారు. 

ఇక‌, తండ్రి కేసీఆర్‌కు క‌విత రాసిన ర‌హ‌స్య‌ లేఖ ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో ఫాద‌ర్, స‌న్‌, డాట‌ర్‌కే తెలియాల‌ని అరుణ పేర్కొన్నారు. ముందు వార్తా ప‌త్రిక‌ల్లో లేఖ దిగింది... ఆ త‌ర్వాత క‌విత అమెరికా నుంచి దిగింద‌ని ఎద్దేవా చేశారు. వారి కుటుంబ స‌భ్యులు లేదా స‌న్నిహితులే ఈ ప‌ని చేసి ఉండాల‌న్నారు. దీని వెనుక ఎవ‌రు ఉన్నారో క‌విత‌నే చెప్పాలన్నారు. 

కేసీఆర్ అభివృద్ధి పేరుతో రూ.ల‌క్ష‌ల కోట్లు దోచుకున్నార‌ని ఈ సంద‌ర్భంగా అరుణ ఆరోపించారు. ఇక‌, అబ‌ద్ధాలు చెప్పి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ త‌క్కువ స‌మ‌యంలోనే ప్ర‌జాభిమానాన్ని కోల్పోయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య లోపాయికారి ఒప్పందం ఉంద‌ని ఆమె ఆరోపించారు. ఇదంతా రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌మ‌లం పార్టీ బ‌ల‌ప‌డుతుంటే ఈ రెండు పార్టీలు క‌లిసి డ్రామాలు ఆడుతున్నాయ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తోనే రాష్ట్ర అభివృద్ధి జ‌రుగుతుంద‌ని ఎంపీ డీకే అరుణ అన్నారు.   


DK Aruna
BJP
MLC Kavitha
BRS party
Telangana politics
KCR
BJP state office
Congress party
Telangana development
political comments

More Telugu News