Reethu Varma: పల్లెటూళ్లో పండగలాంటి సిరీస్ .. 'దేవిక & డానీ'

Devika  Danny Series Review
  • తెలుగులో రూపొందిన మరో వెబ్ సిరీస్
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • దేవిక పాత్రలో కనిపించనున్న రీతూ వర్మ 
  • జూన్ 6 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  

ఇప్పుడు ఓటీటీ అనేది వీలైనంత వినోదాన్ని అందించే సాధనంగా మారిపోయింది. వివిధ భాషలలో అనేక జోనర్ల నుంచి సినిమాలు .. సిరీస్ లు ఓటీటీ సెంటర్ కి వచ్చి చేరుతున్నాయి. అడపాదడపా తెలుగు సిరీస్ లు కూడా ఈ జాబితాలో కనిపిస్తున్నాయి. అలా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సిరీస్ .. 'దేవిక & డానీ'. తెలుగులో రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. కిశోర్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. 

'పెళ్లి చూపులు' సినిమా నుంచి ఇటీవల వచ్చిన 'మజాకా' మూవీ వరకూ తన ప్రత్యేకతను చాటుకున్న రీతూ వర్మ, ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రను పోషించింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో శివ కందుకూరి .. సూర్య వశిష్ట .. సుబ్బరాజు .. అభినయ .. గోపరాజు రమణ .. శివన్నారాయణ .. సోనియా సింగ్ తదితరులు కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ను జూన్ 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. 

గ్రామీణ నేపథ్యంలో .. అందమైన ప్రకృతి సమక్షంలో జరిగే కథ ఇది. దేవిక ఆ గ్రామానికి చెందిన ఒక అందమైన యువతి. అందరి అమ్మాయిల మాదిరిగానే జీవితంపై ఎన్నో ఆశలు .. కలలు  ఉంటాయి. అలాంటి ఆమె జీవితంలోకి 'డానీ' అడుగుపెడతాడు. అతని రాకతో ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. పల్లెటూరి వాతావరణం .. సందడి చేసే పాత్రలు చూస్తుంటే, ఇదో పల్లెటూరి పండగలాంటి సిరీస్ అనిపిస్తోంది. 

Reethu Varma
Devika and Danny
Telugu web series
Romantic thriller
OTT streaming
Shiva Kandukuri
Rural drama
Telugu movies
Telugu cinema
New web series

More Telugu News