Manchu Vishnu: మంచు కుటుంబ వివాదాలపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు.. స్పందించిన మంచు విష్ణు

Manchu Vishnu Responds to Tammareddys Comments on Manchu Family Disputes
  • కుటుంబ వివాదాలపై తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన
  • మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న తమ్మారెడ్డి భరద్వాజ
  • సూచనలు తప్పకుండా పాటిస్తానన్న మంచు విష్ణు
మంచు విష్ణు కథానాయకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమా గురించిన విశేషాలను విష్ణు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన అంశాలతో పాటు తన కుటుంబంలోని వివాదాలపై కూడా మంచు విష్ణు స్పందించారు.

ఇంటర్వ్యూలో మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదాల గురించి తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తావించారు. ఆ వివాదాలు చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని, 'కన్నప్ప' విడుదలయ్యాక కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

దీనిపై స్పందించిన విష్ణు, "మీ మాటలను నేను గౌరవిస్తాను. గొడవలు జరిగిన కొన్ని రోజులకే మీరు నాకు ఫోన్ చేసి ఏం జరుగుతుందని అడిగారు. ఆ విషయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. చిత్ర పరిశ్రమ ఒక కుటుంబం లాంటిది. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీ సలహాలు తీసుకుంటాను. మీ మాటలు నేను పాటిస్తాను" అని వినమ్రంగా సమాధానమిచ్చారు. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ఇటీవల విభేదాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.
Manchu Vishnu
KANNAPPA
Manchu Family
Mohan Babu
Manchu Manoj
Tammareddy Bharadwaja

More Telugu News