Pawan Kalyan: పవన్ కల్యాణ్ అసంతృప్తి.. స్పందించిన బన్నీ వాసు

Bunny Vasu Reacts to Pawan Kalyans Disappointment
  • తెలుగు సినీ పరిశ్రమపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం
  • సీఎంను కలవకపోవడంపై పవన్ ప్రశ్నలు
  • పవన్ వ్యాఖ్యలపై నిర్మాత బన్నీ వాసు స్పందన
  • ఇండస్ట్రీలో లోతైన రాజకీయాలున్నాయన్న బన్నీ వాసు
  • మన ఐక్యతను ప్రశ్నించుకోవాలని హితవు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినా సినీ పెద్దలు ముఖ్యమంత్రిని కలవకపోవడంపై ఆయన పరోక్షంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, చిత్ర పరిశ్రమలోని అంతర్గత రాజకీయాలు, ఐక్యత లోపంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు చిత్రసీమ ప్రముఖులకు ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత కూడా లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నట్లు సమాచారం. "కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా, తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా?" అని ఆయన ప్రశ్నించినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో, నిర్మాత బన్నీ వాసు 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, "సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది." అంటూ బన్నీ వాసు తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Pawan Kalyan
Bunny Vasu
Telugu Film Industry
Andhra Pradesh Government
AP Government
Tollywood
Telugu Cinema
Political Issues
Movie Industry
Deputy CM

More Telugu News