Vijayawada: విజయవాడ, విశాఖలో కలకలం రేపిన బాంబు బెదిరింపులు

Vijayawada Visakhapatnam Bomb Threats Trigger Alert in AP
  • విజయవాడ, విశాఖలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసు యంత్రాంగం
  • ఎక్కడా కనిపించని అనుమానాస్పద వస్తువులు 
  • ఫేక్ కాల్స్‌గా నిర్ధారించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విజయవాడ రైల్వే స్టేషన్, బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం, ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్టీటీ) రైలులో బాంబులు ఉన్నట్లు శనివారం కంట్రోల్ రూమ్‌లకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ రావడంతో తీవ్ర సంచలనమైంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్‌ను, పోలీసు జాగిలాలను రంగంలోకి దింపి విస్తృతంగా తనిఖీలు చేపట్టింది.

సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతకు ముందు బీసెంట్ రోడ్డులోని షాపులన్నింటినీ మూసివేయించి తనిఖీలు చేశారు. ఎల్ఐసీ భవనం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసిన సాంకేతిక సిబ్బంది అవి ఫేక్ కాల్స్‌గా నిర్ధారించారు. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్‌లో ముంబయి నుంచి వచ్చిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులోనూ విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే ఎల్ 2 బోగీలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు. 
Vijayawada
Vijayawada bomb threat
Visakhapatnam
Visakhapatnam bomb threat
AP police
Bomb threat
Fake bomb call
Railway station
LTT Express
Besant Road

More Telugu News