Shamshabad: శంషాబాద్‌లో ఘోర ప్ర‌మాదం.. పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కానిస్టేబుల్‌ మృతి

Constable Vijay Kumar Dies in Shamshabad Road Accident
  • రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం
  • బెంగళూరు హైవేపై పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ
  • కానిస్టేబుల్ విజయ్‌ కుమార్ మృతి.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

వారిని చికిత్స కోసం హుటాహుటిన సమీపంలోని ఆసుప‌త్రికి తరలించారు. విజయ్‌ కుమార్‌ శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక‌, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Shamshabad
Vijay Kumar
Road Accident
Police Patrol Vehicle
Constable Death
Bengaluru Highway
Rangareddy District
Police Investigation

More Telugu News