Tripti Dimri: 'స్పిరిట్'లో ప్రభాస్ సరసన నటించే కథానాయకి ఖరారు .. ఆమె ఎవరంటే ..?

Tripti Dimri confirmed as lead actress in Prabhas Spirit movie
  • స్పిరిట్ మూవీ కథానాయకి పేరును ప్రకటించిన దర్శకుడు సందీప్ 
  • తొమ్మిది భాషల్లో త్రిప్తి డిమ్రీ పేరును ఎక్స్ వేదికగా రాసుకొచ్చిన సందీప్
  • దర్శకుడు సందీప్ కు ధన్యవాదాలు తెలిపిన త్రిప్తి  
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' మూవీ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి కాగా, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు దర్శకుడు సందీప్ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించే కథానాయిక ఎవరా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలువురు బాలీవుడ్ అగ్ర కథానాయికల పేర్లు వినిపించాయి. అయితే, ఆ ఊహాగానాలకు తెర దించుతూ ఈ మూవీలో కథానాయికగా నటించే అవకాశాన్ని త్రిప్తి డిమ్రీ దక్కించుకుంది. దర్శకుడు సందీప్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

'స్పిరిట్' ప్రాజెక్టులో నటీనటులకు సంబంధించి ప్రభాస్ తర్వాత వచ్చిన అధికారిక ప్రకటన ఇదే. దాదాపు తొమ్మిది భాషల్లో ఈ మూవీని తీర్చిదిద్దనున్నట్లు తాజా ప్రకటనను బట్టి తెలుస్తోంది. త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాశారు. పాన్ వరల్డ్ మూవీగా 'స్పిరిట్'ను తీర్చిదిద్దనున్నట్లు ఈ ప్రకటనను బట్టి అర్థమవుతోంది.

ఈ మూవీకి కథానాయికగా ఎంపికైన త్రిప్తి స్పందిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రకటనతో ఆనందంలో మునిగిపోయానని పేర్కొంది. ఇదివరకే సందీప్ రెడ్డి రూపొందించిన 'యానిమల్' మూవీలో త్రిప్తి కీలక పాత్ర పోషించింది. 
Tripti Dimri
Prabhas
Spirit Movie
Sandeep Reddy Vanga
Pan World Movie
Tollywood
Bollywood
Animal Movie
Indian Cinema

More Telugu News