KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ కీలక సమావేశం

KTR Meeting with KCR Key Discussions at Farmhouse
  • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ
  • ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక సమావేశం
  • కవిత లేఖ, వ్యాఖ్యలపై చర్చించినట్లు సమాచారం
  • జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలపైనా మంతనాలు
  • ఈ నెల 28న కేటీఆర్ అమెరికా పర్యటన
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేటీఆర్, ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు, రాబోయే కార్యక్రమాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవల ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి కేసీఆర్‌కు రాసిన అంతర్గత లేఖ బయటకు రావడం, ఆ తర్వాత ఆమె మీడియా సమావేశంలో "కేసీఆర్‌ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి" అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనూ, రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ లేఖ, కవిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ను కేటీఆర్ కలవడం ప్రాధాన్యంత సంతరించుకుంది. పార్టీలోని ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై వీరిద్దరూ సమీక్షించుకున్నట్లు సమాచారం.

మరోవైపు, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగా నిర్వహించాలనే దానిపై కూడా వీరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. కాగా, కేటీఆర్ ఈ నెల 28వ తేదీన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 1న అక్కడ నిర్వహించే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో, అమెరికా పర్యటనకు ముందే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలపై ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించేందుకే కేసీఆర్‌తో కేటీఆర్ చర్చించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. 
KTR
KTR meeting KCR
BRS party
Telangana politics
Kavitha letter
Telangana formation day
KCR farm house
Errvalli
Telangana news
KTR US tour

More Telugu News