AI Movie: 15 మంది ఏఐ క్యారెక్టర్లతో సినిమా

AI Movie Love You Released with 15 AI Characters
  • కృత్రిమ మేథ సినిమా వచ్చేసింది
  • 15 మంది ఏఐ క్యారెక్టర్లతో "లవ్ యూ" సినిమా
  • ప్రచంచంలోనే తొలి ఏఐ మూవీగా రికార్డుకెక్కిన "లవ్ యూ" 
ఏఐ సాంకేతికతతో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు లేకుండానే సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. హీరో హీరోయిన్లే కాకుండా ఇతర ఆర్టిస్టులు, మొత్తం 15 మంది ఏఐ క్యారెక్టర్లతో ఒక పూర్తి సినిమా ఇటీవల విడుదలైంది.

"లవ్ యూ" పేరుతో కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా ప్రపంచంలోనే తొలి ఏఐ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఏఐ సాంకేతికతతో అద్భుతం సృష్టించవచ్చని నిరూపించారు.

ఈ సినిమా కోసం లేని నటులను సృష్టించడమే కాకుండా, ఒక అద్భుత మాయాలోకాన్ని ప్రేక్షకుల ముందు ఉంచింది ఏఐ. ఈ చిత్రంలో కనిపించే ఊళ్లు, కార్లు, రైళ్లు, చెట్లు చేమలు అన్నీ కల్పితమే. ఇది అంతా కృత్రిమ మేథస్సు చేసిన ఇంద్రజాలమే.

సినిమాలో ఒక్క షాట్ కూడా కెమెరాతో చిత్రీకరించలేదు. తెర ముందు ఇలా మాయా ప్రపంచాన్ని సృష్టించడమే కాకుండా, తెర వెనుక ఈ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని, పాటలకు బాణీలను అందించింది కూడా కృత్రిమ మేథనే.

అయితే సినిమా చూసి హీరో హీరోయిన్లపై అభిమానం పెంచుకునే ప్రేక్షకులకు, ఏఐ నటీనటులను చూడటం అంత ఉత్సాహాన్ని కలిగించకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 
AI Movie
Artificial Intelligence
Love You Kannada Movie
Kannada Film
AI Actors
AI Technology
Virtual Production
Movie Production
Film Industry
Digital Film Making

More Telugu News