Manchu Manoj: అమ్మను ఎవరూ ఆపలేరు: మంచు మనోజ్

Manchu Manoj Interview
  • మంచు మనోజ్ తాజా చిత్రంగా 'భైరవం'
  • ఈ నెల 30న రిలీజ్ అవుతున్న సినిమా 
  • నేను ఎలాంటి తప్పూ చేయలేదు 
  • ఆ విషయం గురించే మౌనిక బాధపడుతూ ఉంటుంది
  • ఇది ఆస్తుల గొడవ కాదన్న మనోజ్  

మంచు మనోజ్ .. ఈ మధ్య కాలంలో సినిమాలలో కంటే, ఫ్యామిలీ సంబంధమైన గొడవల పరంగానే ఆయన పేరు ఎక్కువగా వినిపించింది. చాలా గ్యాప్ తరువాత ఆయన ఒక సినిమా చేశాడు .. ఆ సినిమా పేరే 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 30వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సినిమాతో పాటు తన ఫ్యామిలీ గొడవలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 

" నాన్నగారిని నేను ఎప్పుడూ ఏమీ అనలేదు .. ఆయనపై నేను ఒక్క కేసు కూడా వేయలేదు. ఆయనకి వ్యతిరేకంగా నేను ఎవరినీ కలవలేదు. నాన్నగారికి స్త్రీ లంటే ఎంతో గౌరవం. అలాంటి ఆయన తల్లిదండ్రులు లేని ఒక ఆడపిల్ల ..  కోడలుగా ఇంటికి వచ్చిన ఒక ఆడపిల్లపై కేసులు వేస్తారంటే మీరు నమ్ముతారా? నాన్నగారు అలా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన అలా ఎప్పటికీ చేయరు. దీనిని బట్టి మీకు అర్థమై ఉంటుంది" అని అన్నారు. 

" నేను అది చేశాను .. ఇది చేశాను అంటారు .. సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అంటే చూపించరు. కూర్చుని మాట్లాడుకుందాం అంటే ముందుకు రారు. ఇది నాకు .. మా నాన్నగారికి సంబంధించిన ఆస్తి గొడవ కాదు. అయినా మేము ఇద్దరం దూరం కావడం గురించి 'మౌనిక' బాధపడుతూ ఉంటుంది. అమ్మగారు .. మా అమ్మాయి మంచి ఫ్రెండ్స్. మా అమ్మ వచ్చి వెళుతూనే ఉంటుంది. ఆమెను ఆపడం ఎవరి వలన కాదు. తల్లిని ఎవరు ఆపగలరు ..? ఒకవేళ ఆపి చూస్తే అప్పుడు తెలుస్తుంది" అని అన్నారు. 

Manchu Manoj
Bhairavam Movie
Vijay Kanakamedala
Manchu Family
Mohan Babu
Family Disputes
Telugu Cinema
Mounika Reddy
CCTV Footage
Property Disputes

More Telugu News