Keneeshaa: అత్యాచార బెదిరింపులు.. ఆన్‌లైన్ వేధింపులపై గాయని కెనీషా ఫైర్!

Keneeshaa Faces Rape Threats and Online Harassment
  • తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆవేదన
  • వేధిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైన కెనీషా టీమ్
  • అసభ్య సందేశాల స్క్రీన్‌షాట్లతో నోటీసులు పంపుతామని హెచ్చరిక
  • తప్పు చేస్తే శిక్షకు సిద్ధమంటూ గతంలో కెనీషా ఎమోషనల్ పోస్ట్
  • నటుడు జయం రవితో రిలేషన్‌షిప్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామాలు
తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రముఖ గాయని కెనీషా సిద్ధమయ్యారు. నటుడు జయం రవితో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఆమె ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు శ్రుతిమించడంతో, వీటిపై చట్టపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె టీమ్ అధికారికంగా వెల్లడించింది.

గాయని కెనీషా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, బెదిరింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని ఆమె ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తున్న అసభ్యకరమైన, అశ్లీల సందేశాల వల్ల కెనీషా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఇలాంటి మెసేజ్‌లు పంపే వారి స్క్రీన్‌షాట్లను ఆధారంగా చేసుకుని లీగల్ నోటీసులు పంపుతామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు తాను పంపిన నోటీసు కాపీలను కూడా కెనీషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

కొంతకాలంగా తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారంటూ కెనీషా గతంలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. తనకు వస్తున్న బెదిరింపు సందేశాల స్క్రీన్‌షాట్‌లను పంచుకుంటూ "ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే, దానికి తగిన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నిజం త్వరలోనే బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. అప్పటి వరకు దయచేసి నన్ను ద్వేషించకండి. ప్రశాంతంగా బతకనివ్వండి" అని ఆవేదన వ్యక్తం చేశారు.

నటుడు జయం రవి, గాయని కెనీషా మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ కొంతకాలంగా కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలోనే కెనీషాకు ఈ విధమైన బెదిరింపులు వస్తున్నాయని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఆన్‌లైన్ వేధింపులపై పోరాటానికి సిద్ధమైన కెనీషా నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు.
Keneeshaa
Keneeshaa singer
Jayam Ravi
online harassment
rape threats
social media threats
Kollywood
legal action
cybercrime
singer Kanisha

More Telugu News