Delhi Covid: ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్

Delhi Covid Cases Rise Over 100 in a Week
  • భారత్‌లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు
  • కేరళలో అత్యధికంగా 430 మందికి, మహారాష్ట్రలో 209 మందికి వైరస్
  • కొవిడ్‌తో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి 
దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. వారం రోజుల్లో నగరంలో వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ వైరస్ మళ్లీ పుంజుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,009కి చేరినట్లు కేంద్ర కొవిడ్-19 సమాచార నివేదిక వెల్లడించింది. ఒక్క ఢిల్లీలోనే 104 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 99 కేసులు గత వారం రోజుల్లోనే నమోదవడం గమనార్హం.

రాష్ట్రాల వారీగా కేరళలో 430 మంది, మహారాష్ట్రలో 209 మంది, ఢిల్లీలో 104 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 చొప్పున యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. కొవిడ్ కారణంగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అయితే, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ వంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
Delhi Covid
Covid Delhi
Covid-19 India
India Covid Cases
Coronavirus India
Delhi Coronavirus
Kerala Covid
Maharashtra Covid
Covid Deaths India

More Telugu News