Kakani Govardhan Reddy: కాకాణిని వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు... కోర్టుకు చేరుకున్న అనిల్ యాదవ్

Kakani Govardhan Reddy Produced in Venkatagiri Court
  • అక్రమ మైనింగ్ కేసులో నిన్న కాకాణిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 55 రోజుల తర్వాత పోలీసులకు చిక్కిన కాకాణి
  • కోర్టు వద్ద 144 సెక్షన్ అమలు
అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు కాసేపటి క్రితం వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. తొమ్మిది పోలీసు వాహనాల కాన్వాయ్‌తో, ప్రత్యేక పోలీసు బలగాల పహారాలో కాకాణిని కోర్టుకు తరలించడం గమనార్హం. కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఆయన్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు, కాకాణిని కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా మరో వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోర్టు వద్దకు చేరుకున్నారు.

నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాలుగో నిందితుడిగా (ఏ4) ఉన్నారు. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు చేపట్టడం, దాన్ని తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించడం, అడ్డుకున్న గిరిజనులను బెదిరించడం వంటి పలు తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. దాదాపు 55 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ను నిన్న సాయంత్రం బెంగళూరు సమీపంలోని ఒక రిసార్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kakani Govardhan Reddy
Venkatagiri Court
Anil Kumar Yadav
Illegal Mining Case
YSRCP
Nellore District
Podalakuru Police Station
Quartz Mining
Andhra Pradesh Politics

More Telugu News