KTR: కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం ఫొటో రగడ.. రేవంత్ రెడ్డి ఫొటో పగలడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల తోపులాట

KTR Camp Office Photo Row Sparks Clash in Sircilla
  • సిరిసిల్ల కేటీఆర్ క్యాంపు ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ యత్నం
  • అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం
  • సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పగిలిపోవడంతో కాంగ్రెస్ ఆగ్రహం
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీఛార్జ్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించడంతో ఈ వివాదం తలెత్తింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం ఉండాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఉంచేందుకు వారు ప్రయత్నించగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిత్రపటం పెట్టకుండా వారిని అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అది కాస్తా తోపులాటకు దారితీసింది. ఈ గందరగోళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం ధ్వంసమైంది. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది. ఈ తోపులాట, ఘర్షణలో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ చేతి వేలికి గాయమైంది. పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
KTR
Revanth Reddy
Telangana politics
BRS
Congress
Sircilla
KTR camp office

More Telugu News