Abhilasham: ప్రేమించిన అమ్మాయి భర్తను పోగొట్టుకుని తిరిగొస్తే .. ఓటీటీలో 'అభిలాషం'

Abhilasham Movie Update
  • మలయాళంలో రూపొందిన 'అభిలాషం'
  • మార్చిలో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 23వ తేదీ నుంచి  ఓటీటీలో 
  • సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చిన డైరెక్టర్ 

అటు థియేటర్లలోనైనా .. ఇటు ఓటీటీలలోనైనా మలయాళం సినిమాలకి లభించే ఆదరణ ఎక్కువ. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను అక్కడి ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. వాస్తవానికి దగ్గరగా ప్రవర్తించే పాత్రలను ఎక్కవగా ఆదరిస్తారు. అనవసరమైన హంగులూ ఆర్భాటాలకు అక్కడి కథలు చాలా దూరంగా ఉంటాయి. ఈ కారణంగానే ప్రేక్షకులకు ఒక సినిమా చూస్తున్నట్టుగా కాకుండా, నిజ జీవితాలను దగ్గరగా గమనిస్తున్న భావన కలుగుతుంది. 

ఈ కారణంగానే మేకర్స్ కూడా అందుకు తగిన కంటెంట్ నే రెడీ చేసుకుంటూ ఉంటారు. అలా రూపొందిన సినిమానే 'అభిలాషం'. ఈ ఏడాది మార్చి 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను వదిలారు. సైజూ కురుప్ .. తన్వీ రామ్ .. అర్జున్ అశోకన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ ముగ్గురూ ప్రేక్షకులు బాగా ఎరిగినవారే. వీరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా, సహజత్వం విషయంలో మంచి మార్కులు కొట్టేసింది.      

షంజూ జేబా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అభిలాష్ ఓ చిన్నపాటి బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అతను షెరిన్ అనే యువతిని ప్రేమిస్తాడు. కానీ ధైర్యం చేసి, తన మనసులోని మాటను చెప్పలేకపోతాడు. దాంతో ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిపోతుంది. అయితే హఠాత్తుగా భర్త చనిపోవడంతో ఆ ఊరికి తిరిగొస్తుంది. అప్పుడు అభిలాష్  కీ .. షెరీన్ కి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలేమిటి? అనేది కథ. 


Abhilasham
Malayalam movies
OTT releases
Saiju Kurup
Tanvi Ram
Arjun Ashokan
Amazon Prime
Malayalam cinema
romantic drama
Shanju Jeba

More Telugu News