Abhishek Banerjee: అమెజాన్ ప్రైమ్ లో యాక్షన్ థ్రిల్లర్!

Stolen Movie Review
  • యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా 
  • నేరుగా ఓటీటీ సెంటర్ కి వస్తున్న కంటెంట్ 
  • కిడ్నాప్ చుట్టూ తిరిగే కథాకథనాలు 
  • జూన్ 4 వ తేదీ నుంచి సినిమా విడుదల


అభిషేక్ బెనర్జీ ప్రధానమైన పాత్రను పోషించిన 'మీర్జా పూర్' ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన నుంచి రావడానికి 'స్టోలెన్' సిద్ధమవుతోంది. తేజ్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అనురాగ్ కశ్యప్ .. కిరణ్ రావ్ .. నిఖిల్ అద్వాని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. 

జూన్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమా, ఎన్నో ప్రశంసలను అందుకుంది. కేరళలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. శుభమ్ తో పాటు హరీశ్ ఖన్నా .. మియా మల్జేర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

గౌతమ్ - రామన్ ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ల కళ్లముందే ఒక పాపను కొంతమంది దుండగలు అపహరిస్తారు. అన్నదమ్ములిద్దరూ ఆ పాపను రక్షించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లిద్దరూ ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ. జూన్ 4న రానున్న ఈ  సినిమా, ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.

Abhishek Banerjee
Stolen Movie
Amazon Prime
Tejpal Shetty
Anurag Kashyap
Kiran Rao
Nikhil Advani
Action Thriller Movie
Mirzapur Actor

More Telugu News