Kandula Durgesh: జూన్ మొదటి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

Kandula Durgesh Announces Akhanda Godavari Project Launch in June
  • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన: కందుల దుర్గేశ్
  • పుష్కరాలలోపే పనులు పూర్తవుతాయని వెల్లడి
  • గండికోట‌ను గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి దుర్గేశ్
అఖండ గోదావరి ప్రాజెక్టు గురించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా జూన్ మొదటి వారంలో శంకుస్థాపన జరుగుతుందని తెలియజేశారు.

పవిత్ర గోదావరి పుష్కరాలలోపు పనులు పూర్తవుతాయని ఆయన అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను చక్కగా తయారు చేయించి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులకు టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని మంత్రి తెలిపారు.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. గండికోటను గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బాపట్ల సూర్యలంక బీచ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ బీచ్ జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. 
Kandula Durgesh
Akhanda Godavari Project
Pawan Kalyan
Daggubati Purandeswari
Gajendra Singh Shekhawat
Andhra Pradesh Tourism
Rajahmundry
YSR Kadapa Gandikota Project
Suryalanka Beach Bapatla
Tourism Development

More Telugu News