Zelenskyy: శాంతి చర్చలు జరిగినా రష్యా దాడులు కొనసాగిస్తుందని మండిపడ్డ జెలెన్ స్కీ

Zelenskyy Condemns Continued Russian Attacks Despite Peace Talks
  • మూడు రోజుల్లో 900 లకుపైగా రష్యా డ్రోన్ల దాడి జరిగిందన్న జెలెన్ స్కీ
  • రష్యా కట్టడికి అమెరికా, యూరప్‌లు కఠిన ఆంక్షలు విధించాలని వినతి
  • పుతిన్, జెలెన్ స్కీలపై ట్రంప్ మండిపాటు  
ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, రష్యా తమ దేశంపై దాడులను విరమించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షిపణులు, డ్రోన్లతో రష్యా ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల్లో 900లకు పైగా రష్యా డ్రోన్లతో దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. రష్యాను నిలువరించేందుకు అమెరికా, యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్‌పై శనివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడింది. యుద్ధం ప్రారంభమైన ఈ మూడు సంవత్సరాలలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా తెలుస్తోంది.

ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ ఇష్టానుసారంగా ప్రజలను చంపుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఉక్రెయిన్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని పుతిన్ భావిస్తే, అది అంతిమంగా రష్యా పతనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

అదే సమయంలో, జెలెన్‌స్కీపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. జెలెన్‌స్కీ తన దేశానికి మేలు చేసే విధంగా మాట్లాడటం లేదని, ఆయన మాట్లాడకుండా ఉంటేనే మంచిదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. 
Zelenskyy
Ukraine
Russia
Russia Ukraine war
Drone attacks
Peace talks
Donald Trump
Putin
US sanctions
Europe sanctions

More Telugu News