Dil Raju: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నిర్మాత దిల్‌రాజు

- భార్య, కుమారుడితో ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో దిల్‌రాజు
- స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తన భార్య, కుమారుడితో కలిసి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు ఆలయంలోనికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.