Manchu Vishnu: అయినవాళ్లు అలా .. ప్రభాస్ ఇలా: మంచు విష్ణు

Manchu Vishnu Interview
  • 'కన్నప్ప' కోసం ఒక రేంజ్ లో ఖర్చు పెట్టానన్న మంచు విష్ణు  
  • ప్రభాస్ సపోర్ట్ మరిచిపోలేనిదని వ్యాఖ్య  
  • ఆయన అడిగితే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధమన్న విష్ణు   
  • రక్త సంబంధీకులు నా పతనాన్ని కోరుకుంటున్నారన్న విష్ణు    

మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన 'కన్నప్ప', త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ, 'కన్నప్ప' కోసం భారీస్థాయిలో ఖర్చు పెట్టాము. ఈ సినిమాకి ఆడియన్స్ ను రప్పించడానికి నా ఒక్కడి బలం సరిపోదు.  అందువలన స్టార్స్ సపోర్ట్ కావాలి. ఈ కారణంగానే నేను వెళ్లి ప్రభాస్ ను కలిశాను. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆయన ఓకే చెప్పాడు" అని అన్నారు. 

" ఈ రోజున నేను ఈ సినిమా కోసం ఇంతమొత్తం ఖర్చు పెట్టానంటే, అందుకు కారణం ప్రభాస్ అనే చెబుతాను. ప్రభాస్ కి పారితోషికంగా ఎంత ఇవ్వడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ పారితోషికం గురించి మాట్లాడితే చంపేస్తానని అన్నాడు. మొదటి నుంచి నాకు ప్రభాస్ తో మంచి స్నేహం ఉంది. అయితే ప్రభాస్ ఈ సినిమా చేయడానికి కారణం మాత్రం, మా నాన్నగారిపై ఆయనకి గల అభిమానం అనే చెప్పాలి" అని అన్నారు.  

" అడగ్గానే ప్రభాస్ ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టును గురించి అడుగుతూ, తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. నా రక్త సంబంధీకులే నా పతనాన్ని కోరుకుంటున్న సమయంలో, ఒక ప్రభాస్ లాంటి స్టార్ అండగా నిలబడటం విశేషం. ఈ నెల 30వ తేదీన 'భైరవం' రిలీజ్ అంటున్నారు. సినిమా ఏదైనా అందరూ పడే కష్టం ఒక్కటే. అందువలన అన్ని సినిమాలు బాగా ఆడాలనే నేను కోరుకుంటాను" అని చెప్పారు. 

Manchu Vishnu
Kannappa Movie
Prabhas
Manchu Mohan Babu
Telugu Cinema
Bhairavam Movie
Tollywood
Movie Promotion
Film Industry Support

More Telugu News