Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ స్టోరీ లీక్... 'డర్టీ పీఆర్ గేమ్స్' అంటూ దీపిక పీఆర్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్ర‌హం!

Sandeep Reddy Vanga Angered by Spirit Story Leak Blames Deepika PR
  • ప్ర‌భాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో 'స్పిరిట్'
  • ఈ మూవీలో మొద‌ట దీపికను హీరోయిన్‌గా అనుకున్న‌ సందీప్ రెడ్డి 
  • తాజాగా దీపిక‌ స్థానంలోకి త్రిప్తి డిమ్రీని తీసుకున్న వైనం 
  • దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం
  • దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై ద‌ర్శ‌కుడు ఆగ్రహం
  • మొత్తం కథను బయటపెట్టేసినా త‌న‌కు పోయేదేమీ లేదంటూ ట్వీట్
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో 'స్పిరిట్' అనే సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ మూవీలో మొద‌ట దీపిక పదుకొణెని హీరోయిన్‌గా అనుకున్న‌ సందీప్ రెడ్డి.. ఆ త‌ర్వాత ఆమెను తీసేశారు. దీపిక అనేక కండిషన్లు పెట్టడం వల్లే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశార‌ని వార్తలొచ్చాయి. తాజాగా దీపిక‌ స్థానంలోకి యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని తీసుకున్న సంగతి తెలిసిందే. 

దీనికి ప్రతి చర్యగా ఆమె పీఆర్ టీం స్పిరిట్ స్టోరీని లీక్ చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో దీపిక పదుకొణె, ఆమె పీఆర్ టీమ్‌పై సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డర్టీ పీఆర్ గేమ్స్' అంటూ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సందీప్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

"మీరు ఇలా ఏం చేసినా నన్ను ఏం చేయ‌లేరు.. ఈ సారి మొత్తం స్టోరీని లీక్ చేసుకోండి" అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ఫెమినిజం అంటూ సందీప్ రెడ్డి వంగా కౌంటర్లు కూడా వేశారు. ఈ మేర‌కు ద‌ర్శ‌కుడు 'ఎక్స్'లో పెట్టిన పోస్టు ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 

"నేను ఓ నటికి క‌థ‌ చెప్పినప్పుడు.. ఆమెపై వంద శాతం నమ్మకంతో చెబుతాను. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేసి మీది మీరే బయటపెట్టుకుంటున్నారు. ఓ యంగ్ నటిని కిందకు లాగడం, ఆమెను విమర్శించడం, నా స్టోరీని లీక్ చేయడం.. ఇదేనా మీ ఫెమినిజం. 

ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. నాకు సినిమానే ప్రపంచం.. మీకు ఇది అర్థం కాదు. ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కూడా. మొత్తం కథను బయటపెట్టేసినా నాకు పోయేదేమీ లేదు" అని సందీప్ రెడ్డి వంగా ట్వీట్ చేశారు. దీనికి 'డర్టీ పీఆర్ గేమ్స్' అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ని జోడించారు. అలానే తన దైన స్టయిల్‌లో హిందీలోని ఓ డైలాగ్‌ని కూడా పంచుకున్నారు. 
Sandeep Reddy Vanga
Prabhas
Spirit Movie
Deepika Padukone
Tripti Dimri
Dirty PR Games
Story Leak
Feminism
Tollywood
Sandeep Vanga Twitter

More Telugu News