French Budget Minister: ఫ్రాన్స్ మంత్రి వీడియో వైరల్.. పార్లమెంటులో కెమెరా ముందు ఇదేం పని?.. వీడియో ఇదిగో!

French Budget Minister Viral Video in Parliament
  • పార్లమెంట్ జరుగుతుండగా ముక్కులో వేలుపెట్టిన మహిళా మంత్రి
  • ఆ తర్వాత అదే వేలిని నోట్లో పెట్టుకున్న వైనం
  • గతంలో అటవీ అధికారిణిపై ముక్కులోని ద్రవాన్ని తుడిచిన రష్యాకు చెందిన ఓ గవర్నర్    
ఫ్రాన్స్‌ బడ్జెట్ మంత్రి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో రాజకీయపరమైన వ్యాఖ్యలు లేదా నిర్ణయాలకు సంబంధించింది కాదు. కెమెరా ముందు ఆమె చేసిన ఓ అసాధారణమైన పని వల్ల ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. సదరు మంత్రి కెమెరా ముందే తన ముక్కులో వేలు పెట్టుకుంటూ దొరికిపోయారు. అంతేకాదు, ఆ తర్వాత ఆ వేలిని నోట్లో కూడా పెట్టుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. 

మైక్రో-బ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో షేర్ అయిన ఈ వీడియోలో తెలుపు రంగు జాకెట్ ధరించి, మెడలో స్కార్ఫ్ లాంటి వస్త్రం చుట్టుకుని ఉన్న మంత్రి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్నారు. తన టేబుల్‌పై ఉన్న కొన్ని డాక్యుమెంట్ల పేజీలు తిప్పుతూ, నెమ్మదిగా తన కుడి చేతి చూపుడు వేలిని పైకి లేపి ముక్కులో పెట్టుకోవడం  కనిపించింది. వెంటనే ఆ వేలిని నోటి దగ్గరకు తీసుకెళ్లడం కూడా వీడియోలో రికార్డయింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, అవి సంబంధిత వ్యక్తులను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. గతేడాది అక్టోబర్‌లో రష్యాకు చెందిన ఓ గవర్నర్ తన ముక్కులో వేలు పెట్టుకుని, ఆ ముక్కులోని ద్రవాన్ని అటవీశాఖ అధికారిణిపై తుడిచారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. 
French Budget Minister
France
Budget Minister
Parliament
Viral Video
Social Media
Government
Politics

More Telugu News